Labels

Labels

Saturday, October 27, 2018

రాజమౌళి సినిమాలో కొత్త ట్విస్ట్...... విలన్ గా యంగ్ టైగర్.....!!!!

View Article
రాజమౌళి....తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు... ఇక తన దర్శకత్వంలో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే బాహుబలి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడనడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. బాహుబలి సినిమా తర్వాత తనపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రంలో కొత్త కొత్త ట్విస్టులు బయటికి వస్తున్నాయి. ఇక వీళ్ళ కాంబినేషన్ సినిమా తీయబోతున్నానని రాజమౌళి ఎప్పుడో ప్రకటించేశారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుబోయే సినిమా ఇదే కావడం విశేషం. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగలో తన నట విశ్వరూపం ప్రదర్శించాడనడంలో ఎలాంటి సందేహం లేదు. 


ఇక ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా నుంచి కొత్త కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. ఇన్ని రోజులు ఎన్టీఆర్ ను కేవలం నాయకుడు గానే చూసాం. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ లో మరో కొత్త కోణం చూడబోతున్నాం. అదేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రతి నాయకుడు గా కనిపించబోతున్నాడట. ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా అందులో ఒదిగి పోతాడనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ఇక ఈ సినిమా ప్రేక్షకులకి కన్నుల పండుగ కానుందనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.

Sunday, October 21, 2018

పెళ్లి పీటలేక్కబోతున్న రణ్ వీర్ సింగ్ మరియు దీపికా పడుకొనే....

View Article

రణ్ వీర్ సింగ్ మరియు దీపికా పడుకొనే బాలీవుడ్ తెర పై ఎన్నో చిత్రాల్లో నటించింది ఈ జంట. ఎన్నో రోజులుగా ఈ జంట తెర వెనుక ప్రేమాయణం సాగిస్తున్న విషయం చాలా మందికి తెలిసిన విషయమే. కానీ ప్రేక్షకులు మరియు మీడియా ఈ విషయం గురించి ఎప్పుడు ప్రశ్నించినా సమాధానం దాటవేస్తూ వచ్చారు. ఇక ఆ విషయాన్నే నిజం చేస్తూ మొట్ట మొదటి సారిగా అధికారికంగా ప్రకటించేశారు. ఇక ఇరు కుటుంబాలు ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయాన్ని రణ్ వీర్ సింగ్ మరియు దీపికా పడుకొనే తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ఇక వాళ్లపై వచ్చిన రూమర్లు అన్ని నిజం చేస్తూ ట్విట్టర్ వేదికగా తమ సంతోషాన్ని అభిమానులతో మరియు మీడియా తో పంచుకున్నారు. పలు చిత్రాల్లో ఒకటిగా కలిసి నటించిన ఈ జంట నవంబర్ 19వ తేదీన ఒకటి కాబోతున్నారు. ఇక ఇప్పటి వరకు వీరు పద్మావత్ మరియు బాజిరావ్ మస్తానీ వంటి హిట్ పలు చిత్రాల్లో నటించారు.

Friday, October 19, 2018

అమృతసర్ లో ఘోర రైలు ప్రమాదం.....50 మంది మృత్యువాత

View Article
పంజాబ్ రాష్ట్రం అమృతసర్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయ దశమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. రావణ దహనం సమయంలో ఈ ఘటన జరిగింది. రైలు పట్టాలకు సమీపంలో కొందరు నిలబడి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సమయంలో అటుగా వస్తున్న రైలు ఒక్క సారిగా వారిని ఢీ కొనడంతో దాదాపు యాభై మంది ప్రాణాలు కోల్పోయారు. దహనం చేసే ప్రక్రియ లో భాగంగా జోరుగా టపాకాయల శబ్దం రావడంతో రైలు కూత ఎవరికి వినపడక పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తో అమృత్ సర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం అంతా రక్త సిక్తంగా తయారైంది. రావణ దహనం సమయంలో రైలు పట్టాలు పైన నిలబడి ఫోటోలు తీయడమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ఈ ఘటన లో చాలా మంది గాయపడ్డారు. క్షతగాత్రులని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన పై పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కానీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో సిద్దు అక్కడే ఉండడం కనీస భాధ్యత కూడా లేకుండా వారిని పట్టించుకోకుండా వెళ్లడం తీవ్ర అసహనానికి గురి చేసిందని స్థానికులు వాపోయారు.


Wednesday, October 17, 2018

తెలంగాణ లో ప్రారంభమైన బతుకమ్మ పండుగ....

View Article

తెలంగాణ రాష్ట్రం అంటే సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక బతుకమ్మ పండుగ విషయానికి వస్తే వేరే చెప్పనక్కరలేదు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంస్కృతి అని చెప్పవచ్చు. తెలంగాణ ఆడ పడుచులు, ఆడ బిడ్డలు ఎంతో వైభవంగా జరుపుకునే పండుగే ఈ బతుకమ్మ పండుగ. ఎంగిలి పూల బతుకమ్మ తో మొదలైన ఈ పూల పండుగ నేటితో తొమ్మిదవ రోజులు పూర్తి చేసుకుంది. ఈ తొమ్మిదవ రోజునే తెలంగాణ ప్రజలు సద్దుల బతుకమ్మ గా పిలుచుకుంటారు. ఈ బతుకమ్మ రోజున ఊరు ఊరంతా ఏకమై పూల పండుగని అంగ రంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ దారి పొడవునా వెళ్లి బతుకమ్మ ని ఊరి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ లతో చేరువులన్నీ నిండి నీటిలో పూవుల కొలను ఏర్పడినట్టుగా ఎంతో రమ్యంగా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే దేవుడిని పువ్వులతో కొలుస్తాం. కానీ పువ్వులనే దేవుడిగా మలిచిన ఘనత ఒక తెలంగాణకే దక్కుతుందనడం లో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.
ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఏటా బతుకమ్మ పండుగని చాలా ఘనంగా నిర్వహస్తోంది. ఊరూరా బతుకమ్మ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలని ఉత్తేజ పరుస్తోంది.

Saturday, October 13, 2018

అరవింద సమేత.....రికార్డుల మోత....కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న వీర రాఘవుడు.....!!!!

View Article
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలయికలో భారీ అంచనాలతో విడుదలైన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రావడం ఇదే మొదటి సారి. వీళ్ళ కలయిక లో సినిమా కోసం ప్రేక్షకులు కూడా చాలా ఏళ్లుగా నిరీక్షించాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగానే ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిత్రం విడుదలై రెండు రోజులే అయినా 300 కోట్ల గ్రాస్ ని ఇప్పటికే సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం మరోసారి చూపించాడనే చెప్పాలి. అయితే ఈ చిత్రం చాలా వరకు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ కథాంశం ప్రకారం తెరకెక్కిందనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఫ్యాక్షన్ కథలో నటించడం మరో విశేషం. అయితే త్రివిక్రమ్ తన చిన్న నాటి మిత్రుడైన సునీల్ కి ఈ చిత్రం లో ఒక మంచి రోల్ ఇచ్చాడని చెప్పాలి. ఇక జగపతిబాబు విషయం వేరే చెప్పనక్కర్లేదు. ఇక త్రివిక్రమ్ జగపతిబాబు పాత్రని చాలా అద్భుతంగా మలిచారు. విలనిజాన్ని ప్రత్యేకంగా చూపించడంలో త్రివిక్రమ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. 

కథ విషయానికి వస్తే....

అరవింద సమేత వీర రాఘవ.... టైటిల్ పెట్టడంలో కూడా తన మాయాజాలాన్ని చూపించాడు. ఇక కథ గురించి వేరే చెప్పనక్కరలేదు. 5 రూపాయల నుంచి మొదలైన గొడవ ఫ్యాక్షన్ గోడవగా ఎలా మారింది? మరి వీర రాఘవుడు ఫ్యాక్షన్ గొడవలను నిలువరించాడా? వీర రాఘవుడి నానమ్మ చెప్పిన నీతి ఏంటి? అసలు కథ ఎలాంటి మలుపులు తిరిగింది. ఇవ్వన్నీ తెలియాలంటే ఇక సినిమా చూడాల్సిందే.

Friday, October 12, 2018

కళ్ళు మూస్తే బీజేపి..... తెరిచేలోపు కాంగ్రెస్.... రెప్ప పాటున పార్టీ మార్పు....!!!

View Article
రాజకీయ నాయకులు పదవుల కోసం సీట్ల కోసం పార్టీలు మారడం యాదృచ్చికమే ఆయిన నిన్న జరిగిన ఘటన మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎలక్షన్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర రాజనర్సింహ సతీమణి నిన్న ఉదయం తెలంగాణ బీజేపీ అధ్యకుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరిన విషయం విదితమే. అయితే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయో తెలియదు గానీ, సాయంత్రానికే ఆ పార్టీని వీడుతున్నట్టు సంచలన ప్రకటన చేసి అందరిని షాక్ కి గురి చేశారు. ఇంకా బీజేపీ నాయకుల నుంచి ఈ విషయం పై ఎటువంటి ప్రతి స్పందన రాకపోవడం గమనార్హం.


అయితే ఈ విషయం పై దామోదరం రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్తల మరియు అభిమానుల ఆవేదన చూడలేకే మళ్ళీ సొంత గూటికి చేరినట్టు చెప్పుకొచ్చారు. కానీ ఈ విషయం పై నెటిజన్లు నానా రకాలుగా గుసాగుసలాడుకుంటున్నారు.

Wednesday, October 10, 2018

మాటే కాదు పాట కూడా.....దుమ్ము రేపుతున్న బిత్తిరి సత్తి బతుకమ్మ గానం

View Article
బిత్తిరి సత్తి.... తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. ఓ టీవీ ఛానెల్ ద్వారా బిత్తిరి సత్తి గా తెలుగు ప్రజలకు పరిచయమై తనదైన భాష లో విచిత్రమైన హావభావాలతో తెలుగు ప్రజల్ని నవ్వుల లోకంలో ముంచెత్తుతున్నాడు. తను స్క్రీన్ పైన కనిపించేది కొన్ని నిమిషాలే అయినా, ఉన్నంత సేపు తన సంభాషణతో ప్రేక్షకుల మొఖంలో నవ్వుల పువ్వులు పూయించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే తను బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చు.


ఒక మారు మూల పల్లె నుంచి వచ్చిన బిత్తిరి సత్తి పేరు తెలంగాణ లోని పల్లెల్లోనే కాదు దేశ విదేశాలోను మారు మ్రోగిపోతుంది. ప్రేక్షకుల్ని నవ్వుల లోకంలో ముంచెత్తడమే కాకుండా, తనలో ఉన్న ప్రతిభని ఎక్కడో ఒక చోట బయట పెడుతూనే ఉన్నాడు. కొన్ని స్టేజి షోలలో తన డాన్సులతో కూడా అలరించిన విషయం విదితమే. ఇదే కాకుండా ఈ మధ్యే తుపాకీ రాముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే తన గాత్రంతో కూడా మాయాజాలం చేశాడనే చెప్పాలి. బతుకమ్మ పండుగ సందర్భంగా తను పాడిన పాట యూట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది. కేవలం మూడు రోజుల క్రితమే రిలీజ్ అయిన ఈ పాట ఇప్పటికే 2 మిలియన్ మార్క్ అందుకుని సంచలనాలను సృష్టిస్తూ దూసుకుపోతుంది.

Powered by Blogger.