Friday, October 19, 2018

అమృతసర్ లో ఘోర రైలు ప్రమాదం.....50 మంది మృత్యువాత

పంజాబ్ రాష్ట్రం అమృతసర్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయ దశమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. రావణ దహనం సమయంలో ఈ ఘటన జరిగింది. రైలు పట్టాలకు సమీపంలో కొందరు నిలబడి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సమయంలో అటుగా వస్తున్న రైలు ఒక్క సారిగా వారిని ఢీ కొనడంతో దాదాపు యాభై మంది ప్రాణాలు కోల్పోయారు. దహనం చేసే ప్రక్రియ లో భాగంగా జోరుగా టపాకాయల శబ్దం రావడంతో రైలు కూత ఎవరికి వినపడక పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తో అమృత్ సర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం అంతా రక్త సిక్తంగా తయారైంది. రావణ దహనం సమయంలో రైలు పట్టాలు పైన నిలబడి ఫోటోలు తీయడమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ఈ ఘటన లో చాలా మంది గాయపడ్డారు. క్షతగాత్రులని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన పై పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కానీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో సిద్దు అక్కడే ఉండడం కనీస భాధ్యత కూడా లేకుండా వారిని పట్టించుకోకుండా వెళ్లడం తీవ్ర అసహనానికి గురి చేసిందని స్థానికులు వాపోయారు.


Artikel Terkait

Powered by Blogger.