రాజకీయ నాయకులు పదవుల కోసం సీట్ల కోసం పార్టీలు మారడం యాదృచ్చికమే ఆయిన నిన్న జరిగిన ఘటన మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎలక్షన్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర రాజనర్సింహ సతీమణి నిన్న ఉదయం తెలంగాణ బీజేపీ అధ్యకుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరిన విషయం విదితమే. అయితే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయో తెలియదు గానీ, సాయంత్రానికే ఆ పార్టీని వీడుతున్నట్టు సంచలన ప్రకటన చేసి అందరిని షాక్ కి గురి చేశారు. ఇంకా బీజేపీ నాయకుల నుంచి ఈ విషయం పై ఎటువంటి ప్రతి స్పందన రాకపోవడం గమనార్హం.
అయితే ఈ విషయం పై దామోదరం రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్తల మరియు అభిమానుల ఆవేదన చూడలేకే మళ్ళీ సొంత గూటికి చేరినట్టు చెప్పుకొచ్చారు. కానీ ఈ విషయం పై నెటిజన్లు నానా రకాలుగా గుసాగుసలాడుకుంటున్నారు.