Monday, October 8, 2018

ముదిరిన మాటల యుద్ధం..... డి కె అరుణ, కేసీఆర్ ల మధ్య రగులుతున్న చిచ్చు....!!!!!!

తెలంగాణ లో ముందస్తు ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకి కేవలం కొన్ని రోజుల గడువే ఉండడంతో ఎవరి పంథాలో వారు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు గుప్పించుకుంటున్నారు. పార్టీల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా దూషణలకు పాల్పడుతున్నారు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి మరియు కేసీఆర్ ల మధ్యనే మాటల యుద్ధం జరుగగా, తాజాగా డీకే అరుణ తన స్వరాన్ని కొంచెం ఘాటుగానే వినిపిస్తోంది. కేసీఆర్ అన్న ప్రతి మాటను తిప్పి కొడుతూ ప్రచారంలో దూసుకువెళ్తోంది. ఇక కేసీఆర్ కూడా డీకే అరుణకు తనదైన స్టయిల్లో బుద్ది చెబుతున్నారు. ఇంకా నిజం చెప్పాలంటే అసలు విషయం పక్కన పెట్టి మాటకు ప్రతి మాట ఇవ్వడంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడ చూసినా ఇదే రచ్చ కొనసాగుతూ వస్తోంది. ఇదిలా ఉండగా డీకే అరుణ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందో, మహా కూటమి స్పష్టతని ఇవ్వలేదు. డిసెంబర్ 7వ తేదీనే తెలంగాణ లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోని ప్రకటించగా నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇంత వరకు అభ్యర్ధులని మాత్రం ప్రకటించలేదు. ఇంకో రెండు మూడు రోజుల్లో అభ్యర్ధులని ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు.

Artikel Terkait

Powered by Blogger.