మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలయికలో భారీ అంచనాలతో విడుదలైన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రావడం ఇదే మొదటి సారి. వీళ్ళ కలయిక లో సినిమా కోసం ప్రేక్షకులు కూడా చాలా ఏళ్లుగా నిరీక్షించాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగానే ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిత్రం విడుదలై రెండు రోజులే అయినా 300 కోట్ల గ్రాస్ ని ఇప్పటికే సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం మరోసారి చూపించాడనే చెప్పాలి. అయితే ఈ చిత్రం చాలా వరకు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ కథాంశం ప్రకారం తెరకెక్కిందనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఫ్యాక్షన్ కథలో నటించడం మరో విశేషం. అయితే త్రివిక్రమ్ తన చిన్న నాటి మిత్రుడైన సునీల్ కి ఈ చిత్రం లో ఒక మంచి రోల్ ఇచ్చాడని చెప్పాలి. ఇక జగపతిబాబు విషయం వేరే చెప్పనక్కర్లేదు. ఇక త్రివిక్రమ్ జగపతిబాబు పాత్రని చాలా అద్భుతంగా మలిచారు. విలనిజాన్ని ప్రత్యేకంగా చూపించడంలో త్రివిక్రమ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
కథ విషయానికి వస్తే....
అరవింద సమేత వీర రాఘవ.... టైటిల్ పెట్టడంలో కూడా తన మాయాజాలాన్ని చూపించాడు. ఇక కథ గురించి వేరే చెప్పనక్కరలేదు. 5 రూపాయల నుంచి మొదలైన గొడవ ఫ్యాక్షన్ గోడవగా ఎలా మారింది? మరి వీర రాఘవుడు ఫ్యాక్షన్ గొడవలను నిలువరించాడా? వీర రాఘవుడి నానమ్మ చెప్పిన నీతి ఏంటి? అసలు కథ ఎలాంటి మలుపులు తిరిగింది. ఇవ్వన్నీ తెలియాలంటే ఇక సినిమా చూడాల్సిందే.