Thursday, October 4, 2018

కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యూహం కొంప ముంచనుందా....అసలు ఏం జరగబోతోంది....!!!!

అసలు కేసీఆర్ వ్యూహ రచన ఏంటి? ముందస్తు కి వెళ్ళడానికి గల కారణం ఏంటి? నిజం చెప్పాలంటే ఇది ఎవరికి అంతు చిక్కని చిక్కు ముడి. ఈ చిక్కు ముడిని విప్పాలంటే కేసీఆర్ మదిలోని మాటలను బయట పెట్టాల్సిందే. ఎన్నికలకు 9 నెలలకు ముందుగానే  ఎన్నికల నగారా మోగించాడంటే ఇక ఆ విషయం కేసీఆర్ గారికే తెలియాలి. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు విమర్శనాస్రాలు గుప్పించుకుంటున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలను దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ తనదైన శైలిలో ఎత్తుగడలు ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ ని దెబ్బ కొట్టేందుకు తెలంగాణ లో మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఏకం కాగా, అవేవి తన వేగాన్ని అడ్డుకోలేవన్న రీతిలో, తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. 
ఇప్పటికే   తనకు వ్యతిరేకంగా ఏర్పడిన మహా కూటమి తన మేనిఫెస్టో తో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కేసీఆర్ కూడా మహాకూటమితో పాటు, పార్టీల పరంగా కూడా విమర్శలు చేయడం మొదలు పెట్టారు.
ఈ విషయం పై ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినప్పటికీ, తను ఏర్పాటు చేసిన సభలు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి. ఎన్నో అంచనాలతో ముందస్తు ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కొంగర కలాన్ సభ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సభలో కేసీఆర్ ప్రసంగం కూడా ప్రజలకు నిరుత్సాహం కలిగించిందనే చెప్పాలి. ఇక సభకి తను ఊహించనంత జన సమూహం కూడా రాలేదని కేసీఆర్ నిరుత్సాహ పడినట్లు తెలుస్తోంది.  ఇక ప్రజల్లో కూడా ఈ సభ పై వ్యతిరేకత లేకపోలేదు. కేసీఆర్ తన ఉపన్యాసాన్ని చాలా తక్కువ సమయంలో ముగించడం అందరిని నిరాశకు గురి చేసింది. ఇక సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సభ హరీష్ రావు గారి అండతో పరవా లేదనిపించింది. ఇక నిజామాబాద్ సభ విషయానికి వస్తే అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇంకా మున్ముందు జరిగే సభల్లో కేసీఆర్ గారు తన మార్క్ ని ప్రదర్శించాల్సి ఉంది. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ తన మేనిఫెస్టో ని కూడా ప్రకటించలేదు. ఏం జరుగుతుందో, తన వ్యూహాలెంటో మరియు మున్ముందు జరిగే పరిణామాలేంటో తెలుసుకోవాలంటే ఇక కొంత సమయం వేచి చూడాల్సిందే.

Artikel Terkait

9 comments

Powered by Blogger.