Sunday, September 30, 2018

బిగ్ బాస్-2 విజేత కౌశల్.... రన్నరప్ గా గీతా మాధురి...కౌశల్ సంచలన నిర్ణయం......!!@@

ఎట్టకేలకు 100 రోజుల బిగ్ బాస్ ప్రయాణం నేటితో ముగిసింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోయింది. ఈ 100 రోజులు మన ఇంట్లో మనుషులు గా కలిసిపోయిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు బిగ్ బాస్ ఇంటికి సెలవు పలికేసారు. ఫినాలే ఎపిసోడ్ ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో మరియు టీవీ ల ముందు కూర్చుని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకుల సమక్షంలో విజేత ను ప్రకటించడం జరిగింది. ఒక అద్భుతమైన ఘట్టానికి తెర పడింది. ముందుగా ఫినాలే కి చేరిన అయిదుగురు ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ స్టేజ్ పైకి పిలిచారు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే అందరి కంటే ముందుగా ఫైనల్ చేరిన సామ్రాట్ ముందుగా ఎలిమినేట్ కాగా తర్వాత దీప్తి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంట్లో ముగ్గురు ఇంటి సభ్యులు మిగలగా మూడో వ్యక్తిగా తనీష్ ని కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది.
ఇక అసలు కథ తనీష్ ఎలిమినేషన్ తర్వాత మొదలైంది. ఇంట్లో ఇద్దరు సభ్యులు మిగలగా, వారిద్దరిని నాని స్టేజి పైకి తీసుకుని రావడం జరిగింది. ఇక విజేత ప్రకటించే సమయంలో విక్టరీ వెంకటేష్ వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. కొద్ది సేపు నాని మరియు విక్టరీ వెంకటేష్ లు దోబూచులాడగా, చివరికి నాని టీవీ లో విన్నర్ ని ప్రకటించడం జరిగింది. ఇక చివరకి విజేతగా కౌశల్ నిలవగా రన్నరప్ గా గీత మాధురి నిలిచింది. దీంతో  100 రోజుల బిగ్ బాస్ ప్రయాణానికి తెర పడింది. ఇక చివరలో విజేతగా నిలిచిన కౌశల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు బహుమతిగా వచ్చిన మొత్తాన్ని క్యాన్సర్ బాధితుల చికిత్స నిమిత్తం ఖర్చు చేస్తానని చెప్పి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇక విజేతగా నిలిచిన కౌశల్ కి పలువురు సినీ ప్రముఖులు  ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

Artikel Terkait

Powered by Blogger.