Sunday, September 30, 2018

ఈరోజు బిగ్ బాస్ ఫినాలే....100 రోజుల ప్రయాణానికి నేటితో తెర...!!!

బిగ్ బాస్ షో దాదాపుగా మూడు నెలల క్రితం ప్రారంభమైన ఈ షో నేటితో ముగియనుంది. అంతిమ విజేత ఎవరో తెలుసుకోవాలని ప్రేక్షకులు యావత్ తెలుగు ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. ఈ మూడు నెలలు మన ఇంట్లో మనుషుల్లాగా కలిసిపోయి తెలుగు ప్రజలందరినీ మరో లోకం లోకి తీసుకుపోయిన ఈ షో కి నేటితో తెర పడనుంది. షో ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా ప్రారంభమైన ఈ షో రోజులు గడుస్తున్న కొద్దీ తనదైన స్టయిల్లో అలరించి ప్రేక్షకుల మెప్పుని పొందింది. ప్రతిక్షణం టాస్క్లతో మనల్ని ఉత్తేజపరుస్తూ పరుస్తూ ఒక కొత్త అనుభూతిని మనకు పరిచయం చేసింది. ఇన్ని రోజుల ప్రయాణంలో మనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మన అక్కున చేర్చింది. 16 మంది కొత్త ఇంటి సభ్యులను తెలుగు ప్రజల కుటుంబ సభ్యులను చేసింది. తెలుగు ప్రజలు నిజంగా ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకున్నారు. ఇక సామాజిక మాధ్యమాల గురించి వేరే చెప్పక్కర్లేదు. ప్రతి రోజు ఎవరి నోట విన్నా బిగ్ బాస్, ఎవరి ఇంట్లో చూసినా బిగ్ బాస్, నిజంగా ఈ 100 రోజుల బిగ్ బాస్ తెలుగు ప్రజలకి ఊపిరి అయింది. ఏ షో కి దక్కనంత పాపులారిటీ దక్కిందంటే ఇక వేరే చెప్పనక్కరలేదు. ఇక చివరికి విజేత ఎవరో తేలిపోయే సమయం ఆసన్నమైంది. చూద్దాం ఎవరు విజేత గా నిలుస్తారో....

Artikel Terkait

Powered by Blogger.