రాజమౌళి....తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు... ఇక తన దర్శకత్వంలో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే బాహుబలి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడనడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. బాహుబలి సినిమా తర్వాత తనపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రంలో కొత్త కొత్త ట్విస్టులు బయటికి వస్తున్నాయి. ఇక వీళ్ళ కాంబినేషన్ సినిమా తీయబోతున్నానని రాజమౌళి ఎప్పుడో ప్రకటించేశారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుబోయే సినిమా ఇదే కావడం విశేషం. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగలో తన నట విశ్వరూపం ప్రదర్శించాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా నుంచి కొత్త కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. ఇన్ని రోజులు ఎన్టీఆర్ ను కేవలం నాయకుడు గానే చూసాం. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ లో మరో కొత్త కోణం చూడబోతున్నాం. అదేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రతి నాయకుడు గా కనిపించబోతున్నాడట. ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా అందులో ఒదిగి పోతాడనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ఇక ఈ సినిమా ప్రేక్షకులకి కన్నుల పండుగ కానుందనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.