Wednesday, October 10, 2018

మాటే కాదు పాట కూడా.....దుమ్ము రేపుతున్న బిత్తిరి సత్తి బతుకమ్మ గానం

బిత్తిరి సత్తి.... తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. ఓ టీవీ ఛానెల్ ద్వారా బిత్తిరి సత్తి గా తెలుగు ప్రజలకు పరిచయమై తనదైన భాష లో విచిత్రమైన హావభావాలతో తెలుగు ప్రజల్ని నవ్వుల లోకంలో ముంచెత్తుతున్నాడు. తను స్క్రీన్ పైన కనిపించేది కొన్ని నిమిషాలే అయినా, ఉన్నంత సేపు తన సంభాషణతో ప్రేక్షకుల మొఖంలో నవ్వుల పువ్వులు పూయించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే తను బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చు.


ఒక మారు మూల పల్లె నుంచి వచ్చిన బిత్తిరి సత్తి పేరు తెలంగాణ లోని పల్లెల్లోనే కాదు దేశ విదేశాలోను మారు మ్రోగిపోతుంది. ప్రేక్షకుల్ని నవ్వుల లోకంలో ముంచెత్తడమే కాకుండా, తనలో ఉన్న ప్రతిభని ఎక్కడో ఒక చోట బయట పెడుతూనే ఉన్నాడు. కొన్ని స్టేజి షోలలో తన డాన్సులతో కూడా అలరించిన విషయం విదితమే. ఇదే కాకుండా ఈ మధ్యే తుపాకీ రాముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే తన గాత్రంతో కూడా మాయాజాలం చేశాడనే చెప్పాలి. బతుకమ్మ పండుగ సందర్భంగా తను పాడిన పాట యూట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది. కేవలం మూడు రోజుల క్రితమే రిలీజ్ అయిన ఈ పాట ఇప్పటికే 2 మిలియన్ మార్క్ అందుకుని సంచలనాలను సృష్టిస్తూ దూసుకుపోతుంది.

Artikel Terkait

Powered by Blogger.