Wednesday, October 17, 2018

తెలంగాణ లో ప్రారంభమైన బతుకమ్మ పండుగ....

తెలంగాణ రాష్ట్రం అంటే సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక బతుకమ్మ పండుగ విషయానికి వస్తే వేరే చెప్పనక్కరలేదు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంస్కృతి అని చెప్పవచ్చు. తెలంగాణ ఆడ పడుచులు, ఆడ బిడ్డలు ఎంతో వైభవంగా జరుపుకునే పండుగే ఈ బతుకమ్మ పండుగ. ఎంగిలి పూల బతుకమ్మ తో మొదలైన ఈ పూల పండుగ నేటితో తొమ్మిదవ రోజులు పూర్తి చేసుకుంది. ఈ తొమ్మిదవ రోజునే తెలంగాణ ప్రజలు సద్దుల బతుకమ్మ గా పిలుచుకుంటారు. ఈ బతుకమ్మ రోజున ఊరు ఊరంతా ఏకమై పూల పండుగని అంగ రంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ దారి పొడవునా వెళ్లి బతుకమ్మ ని ఊరి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ లతో చేరువులన్నీ నిండి నీటిలో పూవుల కొలను ఏర్పడినట్టుగా ఎంతో రమ్యంగా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే దేవుడిని పువ్వులతో కొలుస్తాం. కానీ పువ్వులనే దేవుడిగా మలిచిన ఘనత ఒక తెలంగాణకే దక్కుతుందనడం లో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.
ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఏటా బతుకమ్మ పండుగని చాలా ఘనంగా నిర్వహస్తోంది. ఊరూరా బతుకమ్మ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలని ఉత్తేజ పరుస్తోంది.

Artikel Terkait

Powered by Blogger.