తెలుగు చలన చిత్ర పరిశ్రమ రారాజు(ప్రిన్స్), టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టిన రోజు సందర్బంగా అభిమానులకి ఒక గొప్ప కానుకను అందజేశాడు. అది ఏంటి అనుకుంటున్నారా? తన మొదటి చిత్రం రాజా కుమారుడితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన మహేష్ బాబు, భరత్ అనే నేను మూవీతో 24 చిత్రాలు పూర్తి చేసుకున్నాడు. తన మొదటి చిత్రం నుంచి మొన్న వచ్చిన భరత్ అనే నేను చిత్రం వారికి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ, చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఎన్నో రికార్డులని కోళ్ల గొడుతూ బ్లాక్ బస్టర్ చిత్రాలని తన ఖాతాలో వేసుకున్నాడు.
 |
|
ప్రస్తుతం మహేష్ బాబు తన 25 వ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక తన పుట్టిన రోజు సందర్బంగా అభిమానులకి తన మహర్షి చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసి ఫాన్స్ ని కనువిందు చేసారు. అయితే ఈ చిత్రం లో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త లుక్ లో కనిపించబోతుండడం విశేషం. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న తోలి చిత్రం కూడా ఇదే. కాగా ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మహేష్ సరసన పూజా హెగ్డే కథా నాయికగా నటిస్తోంది. అల్లరి నరేష్ ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తున్నట్టుగా సమాచారం. కాగా ఈ చిత్రం కోసం 2019 వరకు వేచి ఉండాల్సిందే.