శ్రీనివాస కళ్యాణం చిత్రం రివ్యూ.....!!!!
సతీష్ వెగ్నేష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం శ్రీనివాస కల్యాణం... ఈ చిత్రంలో నితిన్ కథా నాయకుడుగా నటించగా, రాశి ఖన్నా కథా నాయికగా నటించింది. కాగా వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం... ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో ప్రకాష్ రాజ్ మరియు నందిత శ్వేతా నటించడం విశేషం. అలాగే సతీష్ వెగ్నేష్ణ మరియు దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన రెండవ చిత్రం శ్రీనివాస కల్యాణం.అయిదు రోజుల పెళ్లికి ఒక చక్కటి నిర్వచనం....శ్రీనివాస కల్యాణం...!
ఈ బిజీ జీవితంలో తెలుగు సంప్రదాయాలు కనుమరుగు అవుతున్న వేళ, పెళ్లి యొక్క గొప్పతనాన్ని తనదైన స్టయిల్లో తెరకెక్కించాడు దర్శకుడు సతీష్ వెగ్నేష్ణ. పూర్వం జరిగిన పెళ్లిళ్లకి, ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళకి వ్యత్యాసం ఏంటో ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. తన మొదటి చిత్రం శతమానం భవతి తో పల్లెల యొక్క గొప్పతనం మరియు బంధాల యొక్క విలువల గురించి చాలా బాగా తెరకెక్కించిన సతీష్ వెగ్నేష్ణ ఈ చిత్రం ద్వారా పెళ్లి యొక్క గొప్ప తనం గురించి చెప్పే ప్రయత్నం చేసాడు.కథ అదిరిపోయింది.... కథనం నెమ్మదించింది.....!!!@
చిత్రం విషయానికి వస్తే పెళ్ళి మరియు బంధాల గొప్పతనం గురించి చాలా గొప్పగా కథ రాసుకున్నాడు. కథ విషయానికి వస్తే ఉద్యోగం నిమిత్తం వేరే రాష్ట్రానికి వెళ్లిన శ్రీనివాస రాజు (నితిన్) అనే యువకుడికి శ్రీ (రాశి ఖన్నా) తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కొన్ని రోజులకి ప్రేమగా మారుతుంది. ఈ విషయం తెలిసిన ప్రకాష్రాజ్(ఆర్కే) కొన్ని షరతుల మధ్య వారిద్దరి పెళ్లికి ఒప్పుకుంటాడు. ఆ షరతులేంటి చివరికి వారి పెళ్లి ఎలా జరుగుతుంది అనే విషయాన్ని చిత్రంలో చూడవాలిసిందే. కాకపోతే కథ బాగానే ఉన్నప్పటికీ కథనం కొంచెం నెమ్మదించినట్టుగా అనిపించింది. కానీ ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారనే చెప్పాలి. ఈ సారి మిక్కీ జె మేయర్ ఆకట్టుకునే సంగీతం అందించలేక పోయారు.రివ్యూ: 3/5