Saturday, September 8, 2018

పవన్ ఫాన్స్ కి తీపి కబురు....ఎన్నికలలోపు మరో సినిమా... ..!!!!

అవును మీరు విన్నది నిజమే. పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి తీపి కబురు అందనుంది. పవన్ కళ్యాణ్ 26   చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. ఇది నిజంగా పవన్ ఫాన్స్ పండగ చేసుకోవాలిసిన విషయమే. అసలు సినిమాలు చేస్తాడా చెయ్యడా అన్న విషయంలో ఫాన్స్ ని కొంచెం సందిగ్ధంలో పడేసిన పవన్, ఇక తన తర్వాతి సినిమా పై ఒక క్లారిటీ ఇవ్వడంతో ఫాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. పవన్ నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే, ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉండడంతో, ఎన్నికల రణరంగంలోకి దిగేలోపు ఒక సినిమా చేయాలనీ యోచిస్తున్నాడట. ఇంకా టైటిల్ ఏం ఖరారు చేయలేదు కానీ, దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం ఒక మంచి కథతో రెడీ గా ఉన్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం
Pawan Kalyan 26th Movie
Pawan Kalyan
ఎన్నికలు మొదలయ్యేలోపు నిర్మాతగా కూడా మరో సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. ఇంతకీ హీరో ఎవరనుకుంటున్నారా? స్వయానా తన మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ తేజని తెరంగ్రేటం చేయించే యోచనలో ఉన్నాడట. మరి ఇది ఎంత వారికి సాధ్యపడుతుందో వేచి చూడాలి.

Artikel Terkait

Powered by Blogger.