Monday, July 9, 2018

బిగ్ బాస్-2 లో నాలుగో ఎలిమినేషన్....ఏదైనా జరగొచ్చు అనే టాగ్ లైన్ అందుకునేమో.....!!!

బిగ్ బాస్ రెండవ సీజన్ మొదలై నాలుగు వారాలు పూర్తి అయింది. ఎన్నో సంచలనాలను సృష్టిస్తూ బుల్లి తెరపై అత్యధిక రేటింగ్ తో దూసుకెళ్తోంది. కాగా మొదటి మూడు వారాలు ఒకెత్తు అయితే నాలుగో వారం ఒకెత్తు అని చెప్పాలి. షో మొదలయినప్పటి నుంచి ఇప్పటి వరకు గొడవలు, ఏడుపులు, బుజ్జగింపుల మధ్య సాగుతూ వస్తోంది.   అయితే నాలుగో వారం విషయానికి వస్తే కొంచెం మసాల ఎక్కువైందనే చెప్పాలి. నిన్న జరిగిన ఎపిసోడ్ లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని ముందే కౌశల్ మరియు తనీష్ గొడవ పడటమే ఇందుకు నిదర్శనం. అసలు ఈ గొడవకు కారణం ఏంటంటే బిగ్ బాస్ నిబంధనలకు విరుద్ధంగా గీత మాధురి, దీప్తి మరియు శ్యామల మైక్ లు పక్కన పెట్టి వాష్ రూమ్ లోకి వెళ్లి కౌశల్ గురించి మరియు తన కెప్టెన్సీ గురించి చర్చించుకోవడమే...

షాక్ కి గురి చేసిన శ్యామల పిన్ని ఎలిమినేషన్:

Shymala Elimination


బిగ్ బాస్-2 లో పిన్ని గా బాగా పాపులర్ ఆయిన శ్యామల నాలుగో వారం లో ఎలిమినేషన్ కి గురి అయింది. నిజం చెప్పాలంటే ఇది ఎవరు ఊహించి ఉండరు. ఈ ఎలిమినేషన్ ప్రేక్షకులని ఒక్క సారిగా షాక్ కి గురి చేసింది. ఎందుకంటే షో మొదలయినప్పటి నుంచి ఎలాంటి అభియోగాలు లేకుండా చాలా బాగా తనదైన స్టైల్ లో ఆడుతూ వస్తోంది. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఓటింగ్ తో సంబంధం లేకుండా జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ఎన్నడూ జరగని విధంగా కంటస్టెంట్ చేతుల్లోకి వెళ్ళింది. చెరుకు రసం టాస్క్ లో బాగా ఆడిన కారణం చేత కౌశల్ మరియు తేజస్వికి తన తోటి కంటస్టెంట్ ని ఎలిమినేషన్ నుంచి తప్పించే అవకాశం దక్కింది. ఈ అవకాశంతో వారు నందిని మరియు దీప్తిని ఎలిమినేషన్ నుంచి తప్పించారు. ఈ కారణం చేత అనూహ్యంగా శ్యామల షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది


Artikel Terkait

Oldest Page
Powered by Blogger.