Saturday, September 29, 2018

ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురి చేసిన బిగ్ బాస్....ఇంటి సభ్యులందరు షాక్.....! కారణం ఏంటో తెలుసా

బిగ్ బాస్ హౌస్ ఒక్క సారిగా నిండు కుండలా తయారయింది. ఇంటి సభ్యులందరూ ఒక్క సారిగా షాక్ కు గురి అయ్యారు. బిగ్ బాస్ షో చివరి అంకానికి చేరుతున్న తరుణంలో ఇంట్లోని సభ్యులని మరియు ప్రేక్షకులని ఉత్సాహ పరచడానికి బిగ్ బాస్ తనదైన స్టయిల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ముందుగా ఈరోజు జరిగిన ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంటి సభ్యులని ఆక్టివిటీ గదిలోకి పిలిచి తుది పోరుకు చేరిన అయిదు గురు సభ్యులని అభినందించారు. ఇన్ని రోజుల ప్రయాణంలోని మధుర స్మృతులని గుర్తు చేస్తూ ఇంటి సభ్యులందరిని భావోద్వేగానికి గురి చేశారు.
ఇక ఆ తర్వాత అసలు కథ షురూ అయింది. ఒక్కసారిగా ప్రేక్షకులని మరియు ఇంటి సభ్యులందరిని ఆశ్ఛర్యనికి గురి చేశారు. అదేంటంటే బిగ్బాస్ షో నుంచి నిష్క్రమించిన ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరిగింది. ఇక బిగ్ బాస్ హౌస్లో తన స్నేహితులని చూసే సరికి ఇంటి సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంకా ఫినాలే జరిగే వరకు ఇంటి సభ్యులంతా ఇంట్లోనే కొనసాగే అవకాశాన్ని ఎలిమినేట్ అయిన సభ్యులకు బిగ్ బాస్ కల్పించడం జరిగింది. బిగ్ బాస్ చివరి రోజు ఇంకా హౌస్లో ఎన్ని విశేషాలు జరుగుతాయో వేచి చూడల్సిందే....

Artikel Terkait

Powered by Blogger.