ఎట్టకేలకు బిగ్ బాస్ లో తేజస్వి శకం ఆదివారంతో ముగిసింది. నిజంగా చెప్పాలంటే ఇది కచ్చితంగా ప్రేక్షకుల నిర్ణయం. శుక్రవారం వరకు జరిగిన ఓటింగ్ ప్రక్రియలో తేజస్వి కి చాలా తక్కువ ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తోంది. నిజం చెప్పాలంటే షో ప్రారంభం అయినప్పటి నుండి తన వ్యక్తిత్వం తో ఏదో ఒక విధంగా అటు ప్రేక్షకులకి ఇటు ఇంటి సభ్యులకి చిరాకు తెప్పిస్తూ వచ్చింది. షో ప్రారంభంలో అలా చేసినా, మధ్య లో తన వ్యక్తిత్వం కొంచెం మారినట్టుగా కనిపించింది. కాకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం...? ఇంత లొనే ఎలిమినేషన్ రూపంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళవలిసి వచ్చింది.
అటు నాని ఈ సారి సోషల్ మీడియా పై మరియు కొందరు ప్రేక్షకులు చేస్తున్న హడావిడి పై బాగానే ఫైర్ అయ్యాడు. తేజస్వి పై మరియు ఇంటి సభ్యులపై చేస్తున్న సోషల్ మీడియాలో చేస్తున్న అసభ్యకరమైన పదజాలంపై మండి పడ్డారు. ఇది ఒక గేమ్ షో మాత్రమే గేమ్ ని గేమ్ లాగే చూడండి అని మందలించారు.