Monday, August 20, 2018

బిగ్ బాస్ హౌస్ నుంచి దీప్తి సునైనా ఔట్....ఎలిమినేషన్ కి అదే కారణమా....!!!!

బిగ్ బాస్-2 ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో దీప్తి సునైనా నిష్క్రమించింది. ఎట్టకేలకు 64 రోజుల ప్రయాణం ఆదివారంతో ముగిసింది. ఈ సారి నామినేషన్లో 6 గురు ఇంటి సభ్యులు ఉండగా అందులో ముగ్గురు ఇంటి సభ్యులు శనివారం రోజు సురక్షిత జోన్ లోకి వెళ్లగా ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో భాగంగా అతి తక్కువ ఓట్లతో దీప్తి సునైనా ఇంటి దారి పట్టింది. కాగా ఈ ఎపిసోడ్ కి విజయ్ దేవరకొండతో పాటుగా గీతే గోవిందం దర్శకుడు పరుశురాం హాజరవ్వడం విశేషం. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా దీప్తి సునైనకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని మరియు విజయ్ దేవరకోండ ఒక సీక్రెట్ టాస్క్ ని ఇవ్వటం జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా తనకి బ్లూటూత్ తో పాటుగా కాల్ ని హోస్ట్ నాని మరియు అతిధి గా వచ్చిన విజయ్ దేవేరకొండకి కనెక్ట్ చేయటం జరిగింది. అయితే ఇంటి సభ్యులవరికి తెలియకుండా తాము చెప్పే పనులన్నీ చేయాలని చెప్పటం జరిగింది. అయితే ఎపిసోడ్ మొత్తం కొంచెం సరదాగా సాగుతూ వచ్చింది. ఇక ఎపిసోడ్ చివరకి ఎలిమినేషన్ వంతు వచ్చింది. ఇక హోస్ట్ నాని దీప్తి సునైనా నిష్క్రమించినట్టుగా ప్రకటించాడు.

Deepthi Sunaina Elimination

ఈ క్రమంలో భాగంగా ఇంటి సభ్యులంతా భావోద్వేగానికి లోనయ్యారు. 64 రోజులు తమతో ఉండి ఒకే సారి ఇలా వెళ్లిపోతుండడంతో ఇక ఇంట్లో అల్లరి వెళ్లపోతుండడంతో చాలా బాధ పడ్డారు. ఇక తనీష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఇంట్లో ఎంతో స్నేహంగా మెలిగిన దీప్తి సునైనా వెళ్లిపోతుండడంతో చివరికి ఏడ్చేశాడు. కానీ దీప్తి సునైనా ఎలిమినేట్ అవ్వటానికి కాల్ సెంటర్ టాస్క్లో కౌశల్ తో మాట్లాడిన తీరే ఒక కారణంగా నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

Tuesday, August 14, 2018

Colors Swaithi Marraige

త్వరలో కలర్స్ స్వాతి పెళ్లి....వరుడు ఎవరో తెలుసా

కలర్స్ అనే టీవీ షో ద్వారా బాగా పాపులర్ అయి, ఇప్పుడు కథా నాయికగా మారి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న స్వాతి త్వరలో పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ తను ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతుండడం మరియు వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో వీరి పెళ్ళికి మార్గం సుగమం అయింది. గత కొంత కాలంగా వికాస్ అనే యువకుడితో ప్రేమాయణం కొనసాగిస్తూ వస్తుంది కలర్స్ స్వాతి. ఇంకా విషయం ఏంటంటే తన ప్రియుడు మలేసియా ఎయిర్ లైన్స్ లో పైలట్ గా పని చేస్తున్నాడట. ఇక వీరి పెళ్లి వేడుక ఆగష్టు 30 వ తేదీన  హైదరాబాద్ లో జరగనుంది.

Colors Swathi Marriage
అయితే ఈ వివాహానికి తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖులు హాజరు కానున్నారట. అయితే వివాహం తర్వాత కూడా చిత్రాలలో నటిస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికి తాను కథ నాయికగా చేసిన చిత్రాలన్నీ వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కినవే.

Thursday, August 9, 2018

Srinivasa Kalyanam Telugu Movie 2018 Review

శ్రీనివాస కళ్యాణం చిత్రం రివ్యూ.....!!!!

సతీష్ వెగ్నేష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం శ్రీనివాస కల్యాణం... ఈ చిత్రంలో నితిన్ కథా నాయకుడుగా నటించగా, రాశి ఖన్నా కథా నాయికగా నటించింది. కాగా వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం... ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో ప్రకాష్ రాజ్ మరియు నందిత శ్వేతా నటించడం విశేషం. అలాగే సతీష్ వెగ్నేష్ణ మరియు దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన రెండవ చిత్రం శ్రీనివాస కల్యాణం.
Srinivasa Kalyanam 2018 Telugu Movie Review

అయిదు రోజుల పెళ్లికి ఒక చక్కటి నిర్వచనం....శ్రీనివాస కల్యాణం...!

ఈ బిజీ జీవితంలో తెలుగు సంప్రదాయాలు కనుమరుగు అవుతున్న వేళ, పెళ్లి యొక్క గొప్పతనాన్ని తనదైన స్టయిల్లో తెరకెక్కించాడు దర్శకుడు సతీష్ వెగ్నేష్ణ. పూర్వం జరిగిన పెళ్లిళ్లకి, ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళకి వ్యత్యాసం ఏంటో ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. తన మొదటి చిత్రం శతమానం భవతి తో పల్లెల యొక్క గొప్పతనం మరియు బంధాల యొక్క విలువల గురించి చాలా బాగా తెరకెక్కించిన సతీష్ వెగ్నేష్ణ ఈ చిత్రం ద్వారా పెళ్లి యొక్క గొప్ప తనం గురించి చెప్పే ప్రయత్నం చేసాడు.

కథ అదిరిపోయింది.... కథనం నెమ్మదించింది.....!!!@

చిత్రం విషయానికి వస్తే పెళ్ళి మరియు బంధాల గొప్పతనం గురించి చాలా గొప్పగా కథ రాసుకున్నాడు. కథ విషయానికి వస్తే ఉద్యోగం నిమిత్తం వేరే రాష్ట్రానికి వెళ్లిన శ్రీనివాస రాజు (నితిన్) అనే యువకుడికి శ్రీ (రాశి ఖన్నా) తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కొన్ని రోజులకి ప్రేమగా మారుతుంది. ఈ విషయం తెలిసిన ప్రకాష్రాజ్(ఆర్కే) కొన్ని షరతుల మధ్య వారిద్దరి పెళ్లికి ఒప్పుకుంటాడు. ఆ షరతులేంటి చివరికి వారి పెళ్లి ఎలా జరుగుతుంది అనే విషయాన్ని చిత్రంలో చూడవాలిసిందే. కాకపోతే కథ బాగానే ఉన్నప్పటికీ కథనం కొంచెం నెమ్మదించినట్టుగా అనిపించింది. కానీ ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారనే చెప్పాలి. ఈ సారి మిక్కీ జె మేయర్ ఆకట్టుకునే సంగీతం అందించలేక పోయారు.

రివ్యూ: 3/5

మహేష్ బాబు ఫ్యాన్స్ కి పుట్టిన రోజు కానుక.... మహర్షి ఫస్ట్ లుక్ విడుదల....!!!!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ రారాజు(ప్రిన్స్), టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టిన రోజు సందర్బంగా అభిమానులకి ఒక గొప్ప కానుకను అందజేశాడు. అది ఏంటి అనుకుంటున్నారా? తన మొదటి చిత్రం రాజా కుమారుడితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన మహేష్ బాబు, భరత్ అనే నేను మూవీతో 24 చిత్రాలు పూర్తి చేసుకున్నాడు. తన మొదటి చిత్రం నుంచి మొన్న వచ్చిన భరత్ అనే నేను చిత్రం వారికి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ, చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఎన్నో రికార్డులని కోళ్ల గొడుతూ బ్లాక్ బస్టర్ చిత్రాలని తన ఖాతాలో వేసుకున్నాడు.
Maharshi First Look

ప్రస్తుతం మహేష్ బాబు తన 25 వ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక తన పుట్టిన రోజు సందర్బంగా అభిమానులకి తన మహర్షి చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసి ఫాన్స్ ని కనువిందు చేసారు. అయితే ఈ చిత్రం లో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త లుక్ లో కనిపించబోతుండడం విశేషం. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో  వస్తున్న తోలి చిత్రం కూడా ఇదే. కాగా ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మహేష్ సరసన పూజా హెగ్డే కథా నాయికగా నటిస్తోంది. అల్లరి నరేష్ ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తున్నట్టుగా సమాచారం. కాగా ఈ చిత్రం కోసం 2019 వరకు వేచి ఉండాల్సిందే.     
Powered by Blogger.