ఎట్టకేలకు 100 రోజుల బిగ్ బాస్ ప్రయాణం నేటితో ముగిసింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోయింది. ఈ 100 రోజులు మన ఇంట్లో మనుషులు గా కలిసిపోయిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు బిగ్ బాస్ ఇంటికి సెలవు పలికేసారు. ఫినాలే ఎపిసోడ్ ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో మరియు టీవీ ల ముందు కూర్చుని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకుల సమక్షంలో విజేత ను ప్రకటించడం జరిగింది. ఒక అద్భుతమైన ఘట్టానికి తెర పడింది. ముందుగా ఫినాలే కి చేరిన అయిదుగురు ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ స్టేజ్ పైకి పిలిచారు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే అందరి కంటే ముందుగా ఫైనల్ చేరిన సామ్రాట్ ముందుగా ఎలిమినేట్ కాగా తర్వాత దీప్తి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంట్లో ముగ్గురు ఇంటి సభ్యులు మిగలగా మూడో వ్యక్తిగా తనీష్ ని కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది.
ఇక అసలు కథ తనీష్ ఎలిమినేషన్ తర్వాత మొదలైంది. ఇంట్లో ఇద్దరు సభ్యులు మిగలగా, వారిద్దరిని నాని స్టేజి పైకి తీసుకుని రావడం జరిగింది. ఇక విజేత ప్రకటించే సమయంలో విక్టరీ వెంకటేష్ వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. కొద్ది సేపు నాని మరియు విక్టరీ వెంకటేష్ లు దోబూచులాడగా, చివరికి నాని టీవీ లో విన్నర్ ని ప్రకటించడం జరిగింది. ఇక చివరకి విజేతగా కౌశల్ నిలవగా రన్నరప్ గా గీత మాధురి నిలిచింది. దీంతో 100 రోజుల బిగ్ బాస్ ప్రయాణానికి తెర పడింది. ఇక చివరలో విజేతగా నిలిచిన కౌశల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు బహుమతిగా వచ్చిన మొత్తాన్ని క్యాన్సర్ బాధితుల చికిత్స నిమిత్తం ఖర్చు చేస్తానని చెప్పి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇక విజేతగా నిలిచిన కౌశల్ కి పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
Sunday, September 30, 2018
బిగ్ బాస్-2 విజేత కౌశల్.... రన్నరప్ గా గీతా మాధురి...కౌశల్ సంచలన నిర్ణయం......!!@@
ఈరోజు బిగ్ బాస్ ఫినాలే....100 రోజుల ప్రయాణానికి నేటితో తెర...!!!
బిగ్ బాస్ షో దాదాపుగా మూడు నెలల క్రితం ప్రారంభమైన ఈ షో నేటితో ముగియనుంది. అంతిమ విజేత ఎవరో తెలుసుకోవాలని ప్రేక్షకులు యావత్ తెలుగు ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. ఈ మూడు నెలలు మన ఇంట్లో మనుషుల్లాగా కలిసిపోయి తెలుగు ప్రజలందరినీ మరో లోకం లోకి తీసుకుపోయిన ఈ షో కి నేటితో తెర పడనుంది. షో ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా ప్రారంభమైన ఈ షో రోజులు గడుస్తున్న కొద్దీ తనదైన స్టయిల్లో అలరించి ప్రేక్షకుల మెప్పుని పొందింది. ప్రతిక్షణం టాస్క్లతో మనల్ని ఉత్తేజపరుస్తూ పరుస్తూ ఒక కొత్త అనుభూతిని మనకు పరిచయం చేసింది. ఇన్ని రోజుల ప్రయాణంలో మనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మన అక్కున చేర్చింది. 16 మంది కొత్త ఇంటి సభ్యులను తెలుగు ప్రజల కుటుంబ సభ్యులను చేసింది. తెలుగు ప్రజలు నిజంగా ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకున్నారు. ఇక సామాజిక మాధ్యమాల గురించి వేరే చెప్పక్కర్లేదు. ప్రతి రోజు ఎవరి నోట విన్నా బిగ్ బాస్, ఎవరి ఇంట్లో చూసినా బిగ్ బాస్, నిజంగా ఈ 100 రోజుల బిగ్ బాస్ తెలుగు ప్రజలకి ఊపిరి అయింది. ఏ షో కి దక్కనంత పాపులారిటీ దక్కిందంటే ఇక వేరే చెప్పనక్కరలేదు. ఇక చివరికి విజేత ఎవరో తేలిపోయే సమయం ఆసన్నమైంది. చూద్దాం ఎవరు విజేత గా నిలుస్తారో....
Saturday, September 29, 2018
ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురి చేసిన బిగ్ బాస్....ఇంటి సభ్యులందరు షాక్.....! కారణం ఏంటో తెలుసా
బిగ్ బాస్ హౌస్ ఒక్క సారిగా నిండు కుండలా తయారయింది. ఇంటి సభ్యులందరూ ఒక్క సారిగా షాక్ కు గురి అయ్యారు. బిగ్ బాస్ షో చివరి అంకానికి చేరుతున్న తరుణంలో ఇంట్లోని సభ్యులని మరియు ప్రేక్షకులని ఉత్సాహ పరచడానికి బిగ్ బాస్ తనదైన స్టయిల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ముందుగా ఈరోజు జరిగిన ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంటి సభ్యులని ఆక్టివిటీ గదిలోకి పిలిచి తుది పోరుకు చేరిన అయిదు గురు సభ్యులని అభినందించారు. ఇన్ని రోజుల ప్రయాణంలోని మధుర స్మృతులని గుర్తు చేస్తూ ఇంటి సభ్యులందరిని భావోద్వేగానికి గురి చేశారు.
ఇక ఆ తర్వాత అసలు కథ షురూ అయింది. ఒక్కసారిగా ప్రేక్షకులని మరియు ఇంటి సభ్యులందరిని ఆశ్ఛర్యనికి గురి చేశారు. అదేంటంటే బిగ్బాస్ షో నుంచి నిష్క్రమించిన ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరిగింది. ఇక బిగ్ బాస్ హౌస్లో తన స్నేహితులని చూసే సరికి ఇంటి సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంకా ఫినాలే జరిగే వరకు ఇంటి సభ్యులంతా ఇంట్లోనే కొనసాగే అవకాశాన్ని ఎలిమినేట్ అయిన సభ్యులకు బిగ్ బాస్ కల్పించడం జరిగింది. బిగ్ బాస్ చివరి రోజు ఇంకా హౌస్లో ఎన్ని విశేషాలు జరుగుతాయో వేచి చూడల్సిందే....
Saturday, September 8, 2018
పవన్ ఫాన్స్ కి తీపి కబురు....ఎన్నికలలోపు మరో సినిమా... ..!!!!
![]() |
Pawan Kalyan |