ఇక ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా నుంచి కొత్త కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. ఇన్ని రోజులు ఎన్టీఆర్ ను కేవలం నాయకుడు గానే చూసాం. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ లో మరో కొత్త కోణం చూడబోతున్నాం. అదేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రతి నాయకుడు గా కనిపించబోతున్నాడట. ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా అందులో ఒదిగి పోతాడనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ఇక ఈ సినిమా ప్రేక్షకులకి కన్నుల పండుగ కానుందనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.
Saturday, October 27, 2018
రాజమౌళి సినిమాలో కొత్త ట్విస్ట్...... విలన్ గా యంగ్ టైగర్.....!!!!
ఇక ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా నుంచి కొత్త కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. ఇన్ని రోజులు ఎన్టీఆర్ ను కేవలం నాయకుడు గానే చూసాం. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ లో మరో కొత్త కోణం చూడబోతున్నాం. అదేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రతి నాయకుడు గా కనిపించబోతున్నాడట. ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా అందులో ఒదిగి పోతాడనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ఇక ఈ సినిమా ప్రేక్షకులకి కన్నుల పండుగ కానుందనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.
Sunday, October 21, 2018
పెళ్లి పీటలేక్కబోతున్న రణ్ వీర్ సింగ్ మరియు దీపికా పడుకొనే....
రణ్ వీర్ సింగ్ మరియు దీపికా పడుకొనే బాలీవుడ్ తెర పై ఎన్నో చిత్రాల్లో నటించింది ఈ జంట. ఎన్నో రోజులుగా ఈ జంట తెర వెనుక ప్రేమాయణం సాగిస్తున్న విషయం చాలా మందికి తెలిసిన విషయమే. కానీ ప్రేక్షకులు మరియు మీడియా ఈ విషయం గురించి ఎప్పుడు ప్రశ్నించినా సమాధానం దాటవేస్తూ వచ్చారు. ఇక ఆ విషయాన్నే నిజం చేస్తూ మొట్ట మొదటి సారిగా అధికారికంగా ప్రకటించేశారు. ఇక ఇరు కుటుంబాలు ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయాన్ని రణ్ వీర్ సింగ్ మరియు దీపికా పడుకొనే తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ఇక వాళ్లపై వచ్చిన రూమర్లు అన్ని నిజం చేస్తూ ట్విట్టర్ వేదికగా తమ సంతోషాన్ని అభిమానులతో మరియు మీడియా తో పంచుకున్నారు. పలు చిత్రాల్లో ఒకటిగా కలిసి నటించిన ఈ జంట నవంబర్ 19వ తేదీన ఒకటి కాబోతున్నారు. ఇక ఇప్పటి వరకు వీరు పద్మావత్ మరియు బాజిరావ్ మస్తానీ వంటి హిట్ పలు చిత్రాల్లో నటించారు.
Friday, October 19, 2018
అమృతసర్ లో ఘోర రైలు ప్రమాదం.....50 మంది మృత్యువాత
ఈ ఘటన పై పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కానీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో సిద్దు అక్కడే ఉండడం కనీస భాధ్యత కూడా లేకుండా వారిని పట్టించుకోకుండా వెళ్లడం తీవ్ర అసహనానికి గురి చేసిందని స్థానికులు వాపోయారు.
Wednesday, October 17, 2018
తెలంగాణ లో ప్రారంభమైన బతుకమ్మ పండుగ....
తెలంగాణ రాష్ట్రం అంటే సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక బతుకమ్మ పండుగ విషయానికి వస్తే వేరే చెప్పనక్కరలేదు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంస్కృతి అని చెప్పవచ్చు. తెలంగాణ ఆడ పడుచులు, ఆడ బిడ్డలు ఎంతో వైభవంగా జరుపుకునే పండుగే ఈ బతుకమ్మ పండుగ. ఎంగిలి పూల బతుకమ్మ తో మొదలైన ఈ పూల పండుగ నేటితో తొమ్మిదవ రోజులు పూర్తి చేసుకుంది. ఈ తొమ్మిదవ రోజునే తెలంగాణ ప్రజలు సద్దుల బతుకమ్మ గా పిలుచుకుంటారు. ఈ బతుకమ్మ రోజున ఊరు ఊరంతా ఏకమై పూల పండుగని అంగ రంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ దారి పొడవునా వెళ్లి బతుకమ్మ ని ఊరి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ లతో చేరువులన్నీ నిండి నీటిలో పూవుల కొలను ఏర్పడినట్టుగా ఎంతో రమ్యంగా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే దేవుడిని పువ్వులతో కొలుస్తాం. కానీ పువ్వులనే దేవుడిగా మలిచిన ఘనత ఒక తెలంగాణకే దక్కుతుందనడం లో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.
ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఏటా బతుకమ్మ పండుగని చాలా ఘనంగా నిర్వహస్తోంది. ఊరూరా బతుకమ్మ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలని ఉత్తేజ పరుస్తోంది.
Saturday, October 13, 2018
అరవింద సమేత.....రికార్డుల మోత....కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న వీర రాఘవుడు.....!!!!
కథ విషయానికి వస్తే....
Friday, October 12, 2018
కళ్ళు మూస్తే బీజేపి..... తెరిచేలోపు కాంగ్రెస్.... రెప్ప పాటున పార్టీ మార్పు....!!!
Wednesday, October 10, 2018
మాటే కాదు పాట కూడా.....దుమ్ము రేపుతున్న బిత్తిరి సత్తి బతుకమ్మ గానం
Monday, October 8, 2018
ముదిరిన మాటల యుద్ధం..... డి కె అరుణ, కేసీఆర్ ల మధ్య రగులుతున్న చిచ్చు....!!!!!!
తెలంగాణ లో ముందస్తు ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకి కేవలం కొన్ని రోజుల గడువే ఉండడంతో ఎవరి పంథాలో వారు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు గుప్పించుకుంటున్నారు. పార్టీల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా దూషణలకు పాల్పడుతున్నారు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి మరియు కేసీఆర్ ల మధ్యనే మాటల యుద్ధం జరుగగా, తాజాగా డీకే అరుణ తన స్వరాన్ని కొంచెం ఘాటుగానే వినిపిస్తోంది. కేసీఆర్ అన్న ప్రతి మాటను తిప్పి కొడుతూ ప్రచారంలో దూసుకువెళ్తోంది. ఇక కేసీఆర్ కూడా డీకే అరుణకు తనదైన స్టయిల్లో బుద్ది చెబుతున్నారు. ఇంకా నిజం చెప్పాలంటే అసలు విషయం పక్కన పెట్టి మాటకు ప్రతి మాట ఇవ్వడంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడ చూసినా ఇదే రచ్చ కొనసాగుతూ వస్తోంది. ఇదిలా ఉండగా డీకే అరుణ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందో, మహా కూటమి స్పష్టతని ఇవ్వలేదు. డిసెంబర్ 7వ తేదీనే తెలంగాణ లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోని ప్రకటించగా నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇంత వరకు అభ్యర్ధులని మాత్రం ప్రకటించలేదు. ఇంకో రెండు మూడు రోజుల్లో అభ్యర్ధులని ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు.
Friday, October 5, 2018
బిగ్ బాస్-2 విజేత కౌశల్ కి మరో గుర్తింపు.... గిన్నిస్ బుక్ లో చోటు...!!!
బిగ్ బాస్-2 విజేత కౌశల్ కి మరో అరుదైన గౌరవం దక్కబోతోంది. బిగ్ బాస్ షో పూర్తి అయి వారం రోజులు గడిచినా కౌశల్ మానియా మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మరియు బడా దర్శకుల నుండి అభినందనల వెల్లువ కొన సాగుతూనే ఉంది. స్వయంగా ప్రిన్స్ మహేష్ బాబు గారే తనని పొగడ్తలతో ముంచెత్తడంతో కౌశల్ క్రేజ్ ఏ విధంగా ఉందో వేరే చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ షో నుంచి మొదటే నిష్క్రమించిన బాబు గోగినేని మరియు తేజస్వి కౌశల్ పై తమ వైఖరి ని ఏ మాత్రం మార్చుకోలేదు. ఎదో ఒక విధంగా కౌశల్ ని టార్గెట్ చేస్తూ వచ్చారు. తను బయట ఆర్మీ ని సృష్టించి వచ్చాడని, తన ఓట్లన్నీ కొన్నవే తప్ప అభిమానం తో వేసింది కావని చెప్పుకొచ్చారు.
ఏది ఏమైనా కౌశల్ కి ఒక్క సారిగా ఎవరికి రాని క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో ఒంటరి పోరాటం చేసిన కౌశల్ కి బయట ప్రేక్షకుల అండతో విజేత గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ చరిత్రలోనే ఎవరికీ రాని ఓట్లు కౌశల్ కి వచ్చాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగు రాష్టాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు దేశ విదేశాల నుండి కూడా కౌశల్ కి ఓట్ల వెల్లువ కురిసింది. ఇక ఓట్ల వారిగా చూసుకుంటే కౌశల్ కి మొత్తంగా 35 కోట్ల ఓట్లు వచ్చాయని తెలుస్తుంది. బిగ్ బాస్ చరిత్ర లో ఒకే కంటస్టెంట్ కి ఇంత మొత్తం లో ఓట్లు రావడం ఇదే మొదటి సారి. ఈ కారణం చేతనే బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ప్రపంచ రికార్డు ని సొంతం చేసుకోబోతున్నాడు. గిన్నిస్ బుక్ లో తన పేరుని లిఖించబోతున్నాడు.
Thursday, October 4, 2018
కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యూహం కొంప ముంచనుందా....అసలు ఏం జరగబోతోంది....!!!!
ఈ విషయం పై ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినప్పటికీ, తను ఏర్పాటు చేసిన సభలు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి. ఎన్నో అంచనాలతో ముందస్తు ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కొంగర కలాన్ సభ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సభలో కేసీఆర్ ప్రసంగం కూడా ప్రజలకు నిరుత్సాహం కలిగించిందనే చెప్పాలి. ఇక సభకి తను ఊహించనంత జన సమూహం కూడా రాలేదని కేసీఆర్ నిరుత్సాహ పడినట్లు తెలుస్తోంది. ఇక ప్రజల్లో కూడా ఈ సభ పై వ్యతిరేకత లేకపోలేదు. కేసీఆర్ తన ఉపన్యాసాన్ని చాలా తక్కువ సమయంలో ముగించడం అందరిని నిరాశకు గురి చేసింది. ఇక సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సభ హరీష్ రావు గారి అండతో పరవా లేదనిపించింది. ఇక నిజామాబాద్ సభ విషయానికి వస్తే అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇంకా మున్ముందు జరిగే సభల్లో కేసీఆర్ గారు తన మార్క్ ని ప్రదర్శించాల్సి ఉంది. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ తన మేనిఫెస్టో ని కూడా ప్రకటించలేదు. ఏం జరుగుతుందో, తన వ్యూహాలెంటో మరియు మున్ముందు జరిగే పరిణామాలేంటో తెలుసుకోవాలంటే ఇక కొంత సమయం వేచి చూడాల్సిందే.
Sunday, September 30, 2018
బిగ్ బాస్-2 విజేత కౌశల్.... రన్నరప్ గా గీతా మాధురి...కౌశల్ సంచలన నిర్ణయం......!!@@
ఎట్టకేలకు 100 రోజుల బిగ్ బాస్ ప్రయాణం నేటితో ముగిసింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోయింది. ఈ 100 రోజులు మన ఇంట్లో మనుషులు గా కలిసిపోయిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు బిగ్ బాస్ ఇంటికి సెలవు పలికేసారు. ఫినాలే ఎపిసోడ్ ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో మరియు టీవీ ల ముందు కూర్చుని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకుల సమక్షంలో విజేత ను ప్రకటించడం జరిగింది. ఒక అద్భుతమైన ఘట్టానికి తెర పడింది. ముందుగా ఫినాలే కి చేరిన అయిదుగురు ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ స్టేజ్ పైకి పిలిచారు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే అందరి కంటే ముందుగా ఫైనల్ చేరిన సామ్రాట్ ముందుగా ఎలిమినేట్ కాగా తర్వాత దీప్తి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంట్లో ముగ్గురు ఇంటి సభ్యులు మిగలగా మూడో వ్యక్తిగా తనీష్ ని కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది.
ఇక అసలు కథ తనీష్ ఎలిమినేషన్ తర్వాత మొదలైంది. ఇంట్లో ఇద్దరు సభ్యులు మిగలగా, వారిద్దరిని నాని స్టేజి పైకి తీసుకుని రావడం జరిగింది. ఇక విజేత ప్రకటించే సమయంలో విక్టరీ వెంకటేష్ వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. కొద్ది సేపు నాని మరియు విక్టరీ వెంకటేష్ లు దోబూచులాడగా, చివరికి నాని టీవీ లో విన్నర్ ని ప్రకటించడం జరిగింది. ఇక చివరకి విజేతగా కౌశల్ నిలవగా రన్నరప్ గా గీత మాధురి నిలిచింది. దీంతో 100 రోజుల బిగ్ బాస్ ప్రయాణానికి తెర పడింది. ఇక చివరలో విజేతగా నిలిచిన కౌశల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు బహుమతిగా వచ్చిన మొత్తాన్ని క్యాన్సర్ బాధితుల చికిత్స నిమిత్తం ఖర్చు చేస్తానని చెప్పి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇక విజేతగా నిలిచిన కౌశల్ కి పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
ఈరోజు బిగ్ బాస్ ఫినాలే....100 రోజుల ప్రయాణానికి నేటితో తెర...!!!
బిగ్ బాస్ షో దాదాపుగా మూడు నెలల క్రితం ప్రారంభమైన ఈ షో నేటితో ముగియనుంది. అంతిమ విజేత ఎవరో తెలుసుకోవాలని ప్రేక్షకులు యావత్ తెలుగు ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. ఈ మూడు నెలలు మన ఇంట్లో మనుషుల్లాగా కలిసిపోయి తెలుగు ప్రజలందరినీ మరో లోకం లోకి తీసుకుపోయిన ఈ షో కి నేటితో తెర పడనుంది. షో ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా ప్రారంభమైన ఈ షో రోజులు గడుస్తున్న కొద్దీ తనదైన స్టయిల్లో అలరించి ప్రేక్షకుల మెప్పుని పొందింది. ప్రతిక్షణం టాస్క్లతో మనల్ని ఉత్తేజపరుస్తూ పరుస్తూ ఒక కొత్త అనుభూతిని మనకు పరిచయం చేసింది. ఇన్ని రోజుల ప్రయాణంలో మనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మన అక్కున చేర్చింది. 16 మంది కొత్త ఇంటి సభ్యులను తెలుగు ప్రజల కుటుంబ సభ్యులను చేసింది. తెలుగు ప్రజలు నిజంగా ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకున్నారు. ఇక సామాజిక మాధ్యమాల గురించి వేరే చెప్పక్కర్లేదు. ప్రతి రోజు ఎవరి నోట విన్నా బిగ్ బాస్, ఎవరి ఇంట్లో చూసినా బిగ్ బాస్, నిజంగా ఈ 100 రోజుల బిగ్ బాస్ తెలుగు ప్రజలకి ఊపిరి అయింది. ఏ షో కి దక్కనంత పాపులారిటీ దక్కిందంటే ఇక వేరే చెప్పనక్కరలేదు. ఇక చివరికి విజేత ఎవరో తేలిపోయే సమయం ఆసన్నమైంది. చూద్దాం ఎవరు విజేత గా నిలుస్తారో....
Saturday, September 29, 2018
ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురి చేసిన బిగ్ బాస్....ఇంటి సభ్యులందరు షాక్.....! కారణం ఏంటో తెలుసా
బిగ్ బాస్ హౌస్ ఒక్క సారిగా నిండు కుండలా తయారయింది. ఇంటి సభ్యులందరూ ఒక్క సారిగా షాక్ కు గురి అయ్యారు. బిగ్ బాస్ షో చివరి అంకానికి చేరుతున్న తరుణంలో ఇంట్లోని సభ్యులని మరియు ప్రేక్షకులని ఉత్సాహ పరచడానికి బిగ్ బాస్ తనదైన స్టయిల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ముందుగా ఈరోజు జరిగిన ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంటి సభ్యులని ఆక్టివిటీ గదిలోకి పిలిచి తుది పోరుకు చేరిన అయిదు గురు సభ్యులని అభినందించారు. ఇన్ని రోజుల ప్రయాణంలోని మధుర స్మృతులని గుర్తు చేస్తూ ఇంటి సభ్యులందరిని భావోద్వేగానికి గురి చేశారు.
ఇక ఆ తర్వాత అసలు కథ షురూ అయింది. ఒక్కసారిగా ప్రేక్షకులని మరియు ఇంటి సభ్యులందరిని ఆశ్ఛర్యనికి గురి చేశారు. అదేంటంటే బిగ్బాస్ షో నుంచి నిష్క్రమించిన ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరిగింది. ఇక బిగ్ బాస్ హౌస్లో తన స్నేహితులని చూసే సరికి ఇంటి సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంకా ఫినాలే జరిగే వరకు ఇంటి సభ్యులంతా ఇంట్లోనే కొనసాగే అవకాశాన్ని ఎలిమినేట్ అయిన సభ్యులకు బిగ్ బాస్ కల్పించడం జరిగింది. బిగ్ బాస్ చివరి రోజు ఇంకా హౌస్లో ఎన్ని విశేషాలు జరుగుతాయో వేచి చూడల్సిందే....
Saturday, September 8, 2018
పవన్ ఫాన్స్ కి తీపి కబురు....ఎన్నికలలోపు మరో సినిమా... ..!!!!
![]() |
Pawan Kalyan |
About Me
Blog Archive
-
▼
2018
(20)
-
▼
October
(10)
- రాజమౌళి సినిమాలో కొత్త ట్విస్ట్...... విలన్ గా యంగ...
- పెళ్లి పీటలేక్కబోతున్న రణ్ వీర్ సింగ్ మరియు దీపికా...
- అమృతసర్ లో ఘోర రైలు ప్రమాదం.....50 మంది మృత్యువాత
- తెలంగాణ లో ప్రారంభమైన బతుకమ్మ పండుగ....
- అరవింద సమేత.....రికార్డుల మోత....కలెక్షన్ల సునామీ ...
- కళ్ళు మూస్తే బీజేపి..... తెరిచేలోపు కాంగ్రెస్.... ...
- మాటే కాదు పాట కూడా.....దుమ్ము రేపుతున్న బిత్తిరి స...
- ముదిరిన మాటల యుద్ధం..... డి కె అరుణ, కేసీఆర్ ల మధ్...
- బిగ్ బాస్-2 విజేత కౌశల్ కి మరో గుర్తింపు.... గిన్న...
- కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యూహం కొంప ముంచనుందా.......
-
▼
October
(10)